Live stream preview
శాంతి ధ్యానం (Telugu)
ఉచిత ధ్యానాలు (Telugu)
•
10m
అంతరంగం లో శాంతి స్థితిని మేల్కొలిపి, శాంతియుత ప్రపంచాన్ని సృష్టించేందుకు సహకరించండి.
ఈ శాంతి ధ్యానం శాంతి కొరకు మానవ చైతన్యం లో జరిగే ఒక ప్రయాణం. ప్రపంచం నలుమూలల నుండి ప్రపంచ శాంతి కొరకు ధ్యానం చేసే వేలమందితో మీరు కూడా చేరండి. తొమ్మిది నిమిషాలు పాటు జరిగే ఈ ధ్యానం శ్వాస, కల్పన, భావాల తో కూడి ఉంటుంది. జీవితాన్ని ఎలా పోరాటం లేకుండా జీవించాలో ఈ ధ్యానం నేర్పుతుంది.
మనోహరావస్థ అయిన ఈ శాంతి స్థితికి జాగృతం అయ్యి కలసి ధ్యానించినప్పుడు, యుధ్ధాలు, సంఘర్షణ, హింస లను తగ్గించే బలమైన శక్తి క్షేత్రాన్ని మనం సృష్టిస్తాము. మనం శాంతి వాహకాలుగా అవుతాము. వ్యక్తిగత పరివర్తన, ప్రపంచ పరివర్తనకు దారి చూపుతుంది. మీ శాంతి ప్రపంచ శాంతి.