మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో, మీ పరిస్థితులలో ఉన్న అన్ని ఆటంకాలను నిర్మూలనం చేసుకుని, మీలో శాంతిని కనుగొనడానికి మీ మార్గం సుగమం చేసుకోండి. శ్వాస క్రియ, కల్పనతో కూడిన ఈ ధ్యాన క్రమంలో కోరిక, వాస్తవం ఏకమమైపోతాయి.
విశ్వ వివేచనతో బంధం ఏర్పరచుకోవడానికి నాలుగు స్థాయిల్లో ప్రయాణిస్తాము.మీ ఉజ్వల భవిష్యత్తును భావించండి. అక్కడ మీరు కోరిన మార్పును సృష్టించడానికి శక్తి సామర్ధ్యాలు కనుగొంటారు.
మీ సధ్యస్ఫురణతో అనుసంధానం అయ్యి సహజంగా నిద్రపోండి. ప్రతిరోజూ హాయిగా నిద్ర పట్టడానికి ఈ రాత్రి వేళ ధ్యానం చేయండి.
ఈ ప్రగాఢమైన ధ్యాన అనుభవం మీలో ఎప్పుడూ ఉండే ప్రేమకు అనుసంధానం చేస్తుంది. అనుసంధానం మీ మెదడుకు అమృతము, మీ హృదయానికి పోషకము. మీరు ఇచ్చి, పుచ్చుకోవాలనుకునే ప్రేమకు అందుబాటులో ఉండటం నేర్చుకోండి.