నాలుగు పరమ రహస్యాలు (Telugu)

నాలుగు పరమ రహస్యాలు (Telugu)

శ్రీ ప్రీతాజీ, శ్రీ క్రిష్ణాజీ 'నాలుగు పరమ రహస్యాలు' అనే వారి పుస్తకం నుండి మీ ద్వారా …

శ్రీ ప్రీతాజీ, శ్రీ క్రిష్ణాజీ 'నాలుగు పరమ రహస్యాలు' అనే వారి పుస్తకం నుండి మీ ద్వారా చేయించడానికి మార్గదర్శనం చేస్తారు.

నాలుగు పరమ రహస్యాలు అనే పుస్తకం లోని ధారావాహిక ధ్యానాలతో మీ చైతన్యంలోని నిగూఢమైన శక్తికి ద్వారాలు తెరుచుకుంటాయి. ఓ అండ్ ఓ అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ ప్రీతాజీ, శ్రీ కృష్ణాజీ మీలోని విభజనాత్మక అంశాలను గుర్తించాలా మార్గనిర్దేశం చేసి, మీలో సంపూర్ణతను పునరుద్ధరించడానికి సహాయం చేస్తారు. ఈ ప్రేమ స్థితి నుండి, మీరు భయాన్ని వదిలి ఐశ్వర్యం, ఆనందంతో కూడిన జీవితాన్ని సృష్టించడం నేర్చుకుంటారు.

Subscribe Share
నాలుగు పరమ రహస్యాలు (Telugu)
  • సంకల్పం స్థిరపరచడం Setting-Your-Intention (Telugu)

    మీ అభీష్టాలను నెరవేర్చుకునే సంకల్పంతో మీ మొదటి అడుగు వేయండి. క్రమబధ్ధంగా మీరు చేయబోయే 21 ధ్యానాలలో ఇది మొదటి ధ్యానం.

  • ది గ్రేట్ సోల్ సింక్. Soul Sync Practice (Telugu)

    మనోహరావస్థకు మిమ్మల్ని చేర్చే శ్వాస క్రియ, ధ్వని, అవలోకనం, కల్పన ల ప్రవాహ క్రమాన్ని అనుభవించండి.

  • మీ అంతరంగ స్థితి. Your Inner State (Telugu)

    చిన్ననాటి అనుభవాల గతాన్ని ఉపశమింప చేయడానికి తోడ్పడే ఈ ధ్యానంలో మీ గతంతో అనుసంధానం అవ్వండి.

  • మీలో ని పసిబిడ్డ. Your inner child (Telugu)

    ఈ ధ్యానం సమయంలో మీలోని పసితనాన్ని
    తిరిగి పొందండి. గతాన్ని గమనించడం వలన మీ పరిమితుల నుండి విముక్తి పొంది, మీరు తేలిక పడుతారు.

  • సంతోషకరమైన బిడ్డ - సోల్ సింక్. Happy child - Soul Sync (Telugu)

    శ్వాస క్రియ, ధ్వని, ప్రకంపనలు కలియబోసిన ధ్యానం యొక్క అనుభవంతో మీలో ని సంతోషకరమైన బిడ్డను మేల్కొలపండి. అపురూప వరాలైన పసిబిడ్డలాంటి ఆశ్చర్యం, అమాయకత్వం, ఆనందం, నమ్మకాలను అనుభవించడానికి మీ చైతన్య ద్వారాలను తెరవండి.

  • సెరీన్ మైండ్. Serene mind practice (Telugu)

    మీ జీవితంలో ఏ పరిస్థితుల్ని అయిన శాంతింప చేయడానికి ఈ 3 నిమిషాల అనుభవం మీకు మార్గం చూపుతుంది. ప్రతిరోజూ లేద ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ సాధన చేయండి.

  • మీ గురించి మీరు తెలుసుకోండి. Know Your Self (Telugu)

    మీ గురించి మీకు ఉత్తమంగా పరిచయం చేసే శక్తివంతమైన కల్పన. మీలో మీరు శాంతిని కనుగొనడానికి ఇది చాలా ముఖ్యమైన అడుగు.

  • మీతో మీరు అనుసంధానం అవ్వండి. Connect to yourself (Telugu)

    మీ అంతరంగ సంఘర్షణలను గమనించడం నేర్చుకోండి. మీ పై మీరు తీర్పునివ్వడం ఆపి మీరు పొందాల్సిన ప్రేమ, కరుణను మీకు మీరు ఇవ్వండి.

  • శాంతిని కనుగొనడం. Finding Peace (Telugu)

    మీ అంతరంగ సత్యాన్ని పవిత్రంగా గుర్తించి అనుభవించండి. ఈ స్థితిలో "ఇలా ఉండాలి" లేద "ఇలా ఉండకూడదు" అన్నది లేదు. నిత్య జీవితం యొక్క ఒత్తిడిలు మీ వ్యక్తిగత నిజాలను ప్రశ్నించినప్పుడు ఈ ద్యానాన్ని ఉపయోగించండి.

  • అందమైన ఆంతర్యం - సోల్ సింక్ Beautiful self - Soul Sync (Telugu)

    మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో, మీ పరిస్థితులలో ఉన్న అన్ని ఆటంకాలను నిర్మూలనం చేసుకుని, మీలో శాంతిని కనుగొనడానికి మీ మార్గం సుగమం చేసుకోండి. శ్వాస క్రియ, కల్పనతో కూడిన ఈ ధ్యాన క్రమంలో కోరిక, వాస్తవం ఏకమమైపోతాయి.

  • రాత్రి వేళ ధ్యానం: సధ్యస్ఫురణ పొందడం. Nightly meditation (Telugu)

    మీ సధ్యస్ఫురణతో అనుసంధానం అయ్యి సహజంగా నిద్రపోండి. ప్రతిరోజూ హాయిగా నిద్ర పట్టడానికి ఈ రాత్రి వేళ ధ్యానం చేయండి.

  • అనుసంధాన ధ్యానం. Connection meditation (Telugu)

    ఈ ప్రగాఢమైన ధ్యాన అనుభవం మీలో ఎప్పుడూ ఉండే ప్రేమకు అనుసంధానం చేస్తుంది. అనుసంధానం మీ మెదడుకు అమృతము, మీ హృదయానికి పోషకము. మీరు ఇచ్చి, పుచ్చుకోవాలనుకునే ప్రేమకు అందుబాటులో ఉండటం నేర్చుకోండి.

  • బాంధవ్యాలను గుర్తించడం. Recognising Relationship (Telugu)

    నిజమైన ప్రేమతో కూడిన బాంధవ్యాలను సృష్టించడం కొరకు సహాయం చేసే ఒక అందమైన చిట్కా. బాంధవ్యాలు చిరకాలం నిలవాలంటే ప్రేమ మాత్రమే ఆధారం.

  • మీ హృదయాన్ని భావించండి. Feeling your heart (Telugu)

    మీ హృదయ స్పందన వినండి అప్పుడు మీరు కరుణను కనుగొంటారు. అదే ప్రేమకు స్వేచ్ఛకు మార్గం. ఈ అంతరంగ స్థితిని గుర్తించడం నిరంతర సాధన ద్వారా సులభతరం అవుతుంది.

  • జీవన చలన చిత్రం The Movie of life (Telugu)

    మీ జీవన చలన చిత్రంలో ముఖ్యమైన భాగం ఏమిటి? సులువైన రెండు నిముషాల ధ్యానం మీ సత్యాన్ని కనుగొనేలా చేస్తుంది.

  • ఒక క్రొత్త తపన A new passion (Telugu)

    ఈ ప్రపంచమంతా నీ వెన్నంటి ఉంది అనే భావనతో ప్రతిరోజూ నిద్ర మేల్కొంటే ఎలా ఉంటుంది. ఈ నాలుగు నిముషాల ధ్యాన క్రమం మీ జీవితంలో మీరు కోరుకున్న దానిని నెరవేర్చుకోనుటకు తోడ్పడుతుంది.

  • హృదయ పూర్వక భాగస్వామి - సోల్ సింక్. Heartfelt partner - Soul Sync (Telugu)

    మనోహరావస్థ అయిన అనుసంధాన స్థితికి మీ హృదయం జాగృతం అయ్యి, అమితమైన ప్రేమ నిండిన జీవిత భాగస్వామి గా భావించండి. ఈ సాధన ఒంటరిగా కాని లేద భాగస్వామితో కాని చేయవచ్చు.

  • మీ శక్తిని తెలుసుకోండి. Know your fuel (Telugu)

    మీరు చేతనామయ సృష్టికర్తగా అయ్యే ప్రయాణంలో ఉన్నారు. మీ ప్రగాఢమైన ఆనందపూరిత తపన యొక్క సహకారంతో మార్పును సృష్టించండి.

  • ఐశ్వర్యం తో మీ బాంధవ్యం. Your relationship with wealth (Telugu)

    మీకున్న భాంధవ్యాన్ని అర్థం చేసుకోండి. ఈ ధ్యానం సంపదను, ఐశ్వర్యాన్ని పెంచే మనసుని పెంపొందిస్తుంది. సంవృద్ది నిండిన మనసుని ఉత్సాహపరుస్తుంది.

  • మీ సారధిని కనుగొనండి. Discover your driver (Telugu)

    మిమ్మల్ని చెలింప చేసేదాన్ని అనుభవించండి. మీ అంతరంగ సత్యంతో సమ్మతమై, మీ కంటి ముందు కనిపించే మార్గం చూడండి.